చిన్నారిపై కోడిపుంజు దాడి.. కేసు నమోదు చేసి జైల్లో పెట్టిన పోలీసులు!
- ఆడుకుంటున్న చిన్నారి బుగ్గ పొడిచిన కోడిపుంజు
- కేసు పెట్టిన చిన్నారి తల్లిదండ్రులు
- అరెస్ట్ చేసి తీసుకెళ్లిన పోలీసులు
పాప ఏడుస్తూ వెళ్లి విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జాటవ్ ఇంటికెళ్లి కోడిపుంజును స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలిసిన జాటవ్ భార్య లక్ష్మి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులపై మండిపడింది.
కోడిపుంజు పొరపాటున చిన్నారిని గాయపరిచిందని, వదిలేయాలని కోరింది. దానిని కోడిలా చూడొద్దని, దానిని సొంత కొడుకులా పెంచుకుంటున్నామని కన్నీరు పెట్టుకుంది. దీంతో కనికరించిన పోలీసులు చిన్నారి తల్లిదండ్రులు, జాటవ్ దంపతులను కూర్చోబెట్టి సమస్యను పరిష్కరించి ఇంటికి పంపారు.