ఆసక్తిని రేపుతోన్న 'దేవ్' ట్రైలర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసక్తిని రేపుతోన్న 'దేవ్' ట్రైలర్

  • కార్తీ హీరోగా రూపొందిన 'దేవ్'
  • సంగీత దర్శకుడిగా హారిస్ జైరాజ్
  •  ఈనెల 14వ తేదీన విడుదల   
కార్తీ .. రకుల్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' సినిమా నిర్మితమైంది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ ను వదిలారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా వుంది.

ప్రధాన పాత్రధారులందరినీ కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా వుంది. 'ఏ పని చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా .. సంతోషంగా ఉంటుందో అదేరా నువ్వు చేయాల్సిన పని' .. 'శరీరాన్ని దృఢ పరచుకోవాలంటే ఎన్నో దారులున్నాయి .. మనసును దృఢ పరచుకోవాలంటే ఒంటరితనం వల్లనే అవుతుంది' అంటూ కార్తీ చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ కీలకమైన పాత్రలను పోషించారు.
karthi
rakul

More Telugu News