పోలీస్ ఇన్ ఫార్మర్ అన్న అనుమానం.. ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి చంపేసిన మావోయిస్టులు!
- మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘటన
- ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన మావోలు
- అటవీప్రాంతాన్ని జల్లెడ పడుతున్న అధికారులు
చివరికి పెనుగుండ గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహంపై ఓ కరపత్రాన్ని విడిచివెళ్లారు. అందులో పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పనిచేయడంతోనే కుజెమిని చంపేశామని మావోలు స్పష్టం చేశారు. కాగా, భారత్ బంద్ తో పాటు మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులతో పాటు భద్రతా బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి.