రాహుల్‌ని రాముడిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో కాంగ్రెస్ పోస్టులు

  • ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్టర్
  • రాముడిలా మారడం బాగుంది
  • కాంగ్రెస్ వైఖరేంటో చెబితే ఇంకా బాగుంటుందన్న బీజేపీ 
బీహార్ కాంగ్రెస్ తమ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రాముడిలా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టర్లు విడుదల చేసింది. పట్నాలో సైతం ఓ పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. అయోధ్య రామ జన్మభూమిలో వివాదం లేని 67 ఎకరాల స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్ ట్రస్ట్‌కి, ఇతర యజమానులకు ఇచ్చేందుకు అనుమతి కోరుతూ కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ సమయంలో రాహుల్ రాముడి అవతారంలో దర్శనమివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేంద్రం వేసిన పిటీషన్‌పై కాంగ్రెస్ వైఖరిని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ‘రాహుల్.. రాముడిగా మారడం బాగుంది. కానీ ఈ రోజు సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై కాంగ్రెస్ నేతలు తమ వైఖరేంటో చెబితే ఇంకా బాగుంటుంది’ అని సంబిత్ పాత్ర పేర్కొన్నారు.
Go Back to Shorts
Rahul Gandhi
Ramudu
Social Media
Ayodhya
Sambith Pathra

More Telugu News