బెంగాల్, అసోం, పుదుచ్చేరిలలో అధికారంలోకి రాబోతున్నాం: రామచందర్ రావు
- భవిష్యత్తులో తెలంగాణలోనూ అధికారంలోకి వస్తామని ధీమా
- మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని వెల్లడి
- మోదీ రాకతో తెలంగాణలో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందన్న రామచందర్ రావు
సైబరాబాద్, హైదరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ల పరిధిలోని 300 డివిజన్ల నుంచి జన సమీకరణ అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ, మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. మోదీ రాకతో రాజకీయ మార్పు ప్రారంభమవుతుందని అన్నారు.