ఇరాన్ పతనం అంచున ఉంది.. వాళ్లే మాకు చెప్పారు: ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్య

Iran just informed US its in state of collapse claims Trump
  • హర్మూజ్ దిగ్బంధనాన్ని ముగించాలని ఇరాన్ కోరిందన్న ట్రంప్
  • ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని వ్యాఖ్య
  • అంతర్గత విభేదాలను వారు పరిష్కరించుకోవాలని సూచన
ఇరాన్ పతనం అంచున ఉందని, ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ ప్రతినిధులే తమకు చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వీలైనంత త్వరగా హర్మూజ్ జలసంధిని కూడా తెరవాలని వారు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. హర్మూజ్ దిగ్బంధనాన్ని ముగించాలని వారు తమను కోరారని 'ట్రూత్' సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

ఇరాన్ తమ నాయకత్వాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉందని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. సుదీర్ఘ యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, తమ దేశ ప్రతినిధులతో చర్చల విషయంలో ఇరాన్ ప్రభుత్వంలో ఉన్న అంతర్గత విభేదాలను వాళ్లు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.

అయితే ఇరాన్ నుంచి ఎవరి ద్వారా తనకు ఈ సమాచారం అందిందనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. అలాగే ఈ సంభాషణ నేరుగా జరిగిందా లేక మధ్యవర్తి ద్వారా తెలిసిందా? రిపబ్లికన్ ప్రభుత్వంలో ఎవరికి ఈ సమాచారం అందింది? అనే ప్రశ్నలపై కూడా వైట్ హౌస్ స్పందించలేదు.
Go Back to Shorts
Iran just informed US it's in state of collapse claims Trump
America President Trump

More Telugu News