పోలింగ్‌కు ముందు నాటుబాంబులు లభ్యం... ఎన్ఐఏకు ఎన్నికల సంఘం కీలక సూచన
- దక్షిణ పరగణాల జిల్లాలోని ఒక ఇంట్లో ఇటీవల నాటు బాంబులు లభ్యం
- పోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఐఏకు ఈసీ సూచన
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించిన ఈసీ
కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం, ఓటింగ్‌కు అంతరాయం కలిగించేందుకు దుండగులు బాంబులను ఉపయోగించే ప్రమాదం ఉందని ఈ పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు సూచించింది. రాష్ట్రంలో పోలింగ్ రోజున, పోలింగ్ తర్వాత ఎటువంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీ తెలిపింది.
దక్షిణ పరగణాలు జిల్లాలోని భాంగర్ ప్రాంతంలో ఇటీవల ఒక ఇంట్లో నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు ఎన్ఐఏ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టింది. బెంగాల్‌లోని 294 అసెంబ్లీ స్థానాలకు గాను 152 చోట్ల తొలి దశలో ఈ నెల 23న పోలింగ్ పూర్తయింది. మిగతా 142 స్థానాల్లో రేపు (ఏప్రిల్ 29) పోలింగ్ జరగనుంది.