పోలింగ్ కేంద్రంలో ఓటును ఫొటో తీసిన యువకుడు.. సోషల్ మీడియాలో పెట్టడంతో పట్టుకున్న అధికారులు!
- తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘటన
- ఎన్నికల్లో ఓటు వేసిన యువకుడు సాగర్
- ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదు
అయితే ఓటు వేసే సమయంలో రహస్యంగా దాన్ని స్మార్ట్ ఫోన్ తో ఫొటో తీశాడు. అయితే ఈ విషయాన్ని నలుగురితో పంచుకోవాలన్న ఉబలాటం అతడిని నిలువనీయలేదు. దీంతో తాను ఓటు వేస్తుండగా దిగిన ఫొటోను సాగర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు సాగర్ పై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.