సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • పెళ్లి చేసుకుంటున్న మరో కథానాయిక
  • బన్నీకి కథ చెప్పిన 'సాహో' దర్శకుడు 
  • బాలకృష్ణ తదుపరి సినిమా అప్ డేట్    
*  టాలీవుడ్ లో మరో నటి పెళ్లి చేసుకుంటోంది. 'అలియాస్ జానకి', 'ఫ్యాషన్ డిజైనర్', 'ఈ నగరానికి ఏమైంది' వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన అనీషా ఆంబ్రోస్ తన బాయ్ ఫ్రెండ్ గుణ జక్కాను వివాహమాడుతోంది. వచ్చే నెలలో వీరి వివాహం జరుగుతుందని సమాచారం.
*  ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'సాహో' చిత్రాన్ని రూపొందిస్తున్న దర్శకుడు సుజిత్ మరోపక్క తన తదుపరి చిత్రానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా అల్లు అర్జున్ కి ఓ కథను చెప్పాడట. అది నచ్చడంతో, దానిని డెవలప్ చేయమని బన్నీ చెప్పాడని తెలుస్తోంది.
*  బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. మొదటి షెడ్యూలులో ఫైట్ మాస్టర్లు రామ్-  లక్ష్మణ్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తారట.  

Go Back to Shorts
Anisha
Prabhas
Sujith
Allu Arjun
Boyapati Sreenu

More Telugu News