బీసీలే నా హైకమాండ్.. వారు ఏం చెప్తే అది చేస్తా: చంద్రబాబు
- జీవితాంతం రుణపడి ఉంటా
- అధికార గర్వం లేదు
- కొన్ని వర్గాలు కొన్నిసార్లే ఓటు వేశారు
- బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగాలి
అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనకు అధికార గర్వం కానీ.. ఏమరుపాటు కానీ లేవని.. వెనుకబడిన వర్గాలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. కొన్ని వర్గాలు కొన్నిసార్లే టీడీపీకి ఓటు వేశాయని.. బీసీలు మాత్రం ఎప్పుడూ వెన్నంటే ఉన్నారన్నారు. అలాంటి బీసీలను మరచిపోతే తనను తాను మరిచిపోయినట్టేనని చంద్రబాబు స్పష్టం చేశారు. బీసీ గ్రూపుల్లో మార్పులు, రిజర్వేషన్ల శాతంపై చర్చ జరగాలన్నారు.