వైసీపీ అధినేత జగన్ తో సమావేశమైన ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి!
- సోదరులతో కలిసి జగన్ తో భేటీ
- ఈ నెల 31న అధికారికంగా చేరిక
- రాజీనామా చేసి రావాలన్న జగన్
ఈ నెల 31న మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కలిసి మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరుతారని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలోకి రావాలని జగన్ సూచించినట్లు పేర్కొన్నాయి. ఈరోజు రాజంపేట, జమ్మలమడుగు నేతలతో అమరావతిలో చంద్రబాబు నిర్వహించిన భేటీకి గైర్హాజరైన సంగతి తెలిసిందే. దీంతో పార్టీ కార్యకర్తలు, నేతల డిమాండ్ నేపథ్యంలో మేడాను చంద్రబాబు సస్పెండ్ చేశారు.