భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్న మేహుల్ చౌక్సీ!

21-01-2019 Mon 10:39 | International
  • పాస్ పోర్టును సరెండర్ చేసిన మేహుల్
  • పీఎన్బీకి రూ. 13 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో నిందితుడు
  • ఇప్పట్లో ఇండియాకు రప్పించడం కష్టమే
పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి, ప్రస్తుతం అంటిగ్వాలో తలదాచుకున్న మేహుల్ చౌక్సీ, తన భారత పౌరసత్వాన్ని వదిలేసుకున్నారు. తన పాస్ పోర్టును ఆంటిగ్వా ప్రభుత్వానికి సరెండర్ చేశారు. మేహుల్ చౌక్సీని ఎలాగైనా ఇండియాకు రప్పించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఇది గట్టి విఘాతమే.

దాదాపు ఏడాదిగా అంటిగ్వాలో ఉంటున్న ఆయన, గడచిన డిసెంబర్ 25న కోర్టు విచారణకు హాజరై, తాను ఇండియాకు వెళ్లలేనని, తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా 41 గంటల పాటు ప్రయాణించలేనని చెప్పిన సంగతి తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుపుకోవచ్చని ఆయన తెలిపారు. కాగా, పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ. 13 వేల కోట్ల మేరకు మోసం చేసి విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోదీకి మేహుల్ స్వయంగా మేనమామే.

గత సంవత్సరం జనవరి తొలివారంలో మేహుల్ దేశం విడిచి వెళ్లిపోయాడు. ఇండియాలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని, ఆపై పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మేహుల్ చౌక్సీ తదితరులను ఎలాగైనా వెనక్కు రప్పిస్తామని, వారిని చట్టం ముందు నిలుపుతామని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మేహుల్ పౌరసత్వాన్ని వదులుకోవడంతో ఆయన్ను ఇప్పట్లో ఇండియాకు రప్పించడం కష్టసాధ్యమేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 
PNBMehul ChowksiAntigvaPassportIndia

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more