Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా టీడీపీలో చేరితే మా పార్టీ మరింత బలపడుతుంది: టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న

మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ టీడీపీలో చేరుతారన్న ప్రచారం ఇప్పటి వరకూ తమ దృష్టికి రాలేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తెలిపారు. విజయవాడలో నేటి సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాధా తమ పార్టీలో చేరితే స్వాగతిస్తామన్నారు.

ఆయన చేరితే తమ పార్టీ మరింత బలపడుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఎవరిని పార్టీలోకి తీసుకున్నా.. వారితో కలిసి పని చేసేందుకు తామంతా సిద్ధంగా ఉన్నట్టు బుద్ధా వెంకన్న తెలిపారు. రాధా మాత్రం తన అనుచరులతో చర్చించిన మీదటే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని స్పష్టం చేశారు.
Vangaveeti Radha Krishna
Budha Venkanna
Telugudesam
Chandrababu

More Telugu News