చంపుతానని బెదిరించిన అల్లుడిపై పెట్రోలు పోసి నిప్పంటించిన అత్త

20-01-2019 Sun 10:07 | National
  • ఆరు నెలల క్రితం కుమార్తె ఆత్మహత్య
  • అరెస్టయి జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన అల్లుడు
  • మద్యం మత్తులో అత్త ఇంటికి వచ్చి హల్‌చల్‌ చేయడంతో ఘటన
ప్రాణం మీదికి వచ్చిందని భయపడిందో, కూతురి ఆత్మహత్య విషాదం వల్ల అల్లుడిపై ఆగ్రహం కట్టలు తెంచుకుందో.. కారణం ఏదైనా అల్లుడినే హతమార్చిందో అత్త. పెట్రోల్‌ పట్టుకుని వచ్చి తననే చంపాలని బెదిరిస్తున్న అతనిపై అదే పెట్రోల్‌ పోసి హత్య చేసింది.

వివరాల్లోకి వెళితే... తమిళనాడులోని నాగపట్నం సీర్కాళికి చెందిన గణేశన్‌ (36), సట్టనాదపురానికి చెందిన ఆండాళ్‌ కుమార్తె రమ్యకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. దంపతుల మధ్య నిత్యం గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో ఐదు నెలల క్రితం రమ్య ఆత్మహత్య చేసుకుంది. అల్లుడి కారణంగానే తన కూతురు చనిపోయిందని ఆండాళ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం గణేశన్‌ను అరెస్టు చేసి కోర్టు ఆదేశాల మేరకు జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన గణేశన్‌ తరచూ ఆండాళ్‌ ఇంటికి వెళ్లి గొడవ పడేవాడు.

ఈ నేపథ్యంలో  శుక్రవారం రాత్రి పూటుగా మద్యం సేవించి పెట్రోలు, కత్తి పట్టుకుని ఆండాళ్‌ ఇంటికి వచ్చాడు. ఆమెను, మనవరాలిని చంపుతానని బెదిరించాడు. ఈ గొడవలో భాగంగా గణేశన్‌ చేతిలోని పెట్రోల్‌ తీసుకున్న ఆండాళ్‌ దాన్ని అతనిపై పోసి నిప్పంటించింది. మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడిన గణేశన్‌ కేకలు వేయడంతో స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. తన కొడుకు మృతిపై అనుమానం ఉందని గణేశన్‌ తండ్రి రాజేంద్రన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదుచేసి విచారించారు. విచారణ సందర్భంగా తనను, మనవరాలిని చంపుతానని బెదిరించడంతో భయంతో తానే హత్యచేసినట్లు ఆండాళ్ అంగీకరించిందని పోలీసులు తెలిపారు.
Tamil Nadunagapatnamson in law murdered

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more