ప్రభాస్ పెళ్లిపై స్పందించిన కృష్ణంరాజు!

20-01-2019 Sun 07:57 | Entertainment
  • 'సాహో' తరువాత ప్రభాస్ పెళ్లి
  • త్వరలోనే ప్రభాస్, నేను కలిసి తెరపై కనిపిస్తాం
  • పుట్టినరోజు సందర్భంగా కృష్ణంరాజు
తనను ప్రభాస్ వివాహం గురించి చాలా మంది అడుగుతున్నారని, 'సాహో' సినిమా విడుదల కాగానే ఆ వేడుక ఉంటుందని రెబల్ స్టార్ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. 'బాహుబలి' తరువాత తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయ స్థాయికి పెరిగిందని అన్నారు. నేడు కృష్ణంరాజు పుట్టినరోజు కావడంతో, ఓ దినపత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన పలు విశేషాలను పంచుకున్నారు.

 తాను 50 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని, అప్పట్లో హీరోల మధ్య ఎటువంటి సత్సంబంధాలుండేవో, ఇప్పుడు మహేశ్, ఎన్టీఆర్, చరణ్, ప్రభాస్ ల మధ్య అటువంటి సంబంధాలే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. త్వరలోనే గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ లో ప్రభాస్ తో లవ్ స్టోరీ నిర్మిస్తామని, అందులో తాను కూడా ఓ కీలక పాత్రను పోషిస్తున్నానని చెప్పారు. ఇటీవల తాను చూసిన సినిమాల్లో 'మహానటి' అద్భుతంగా వుందని చెప్పారు. తనకు ఎస్వీ రంగారావు బయోపిక్ ను చూడాలని ఉందని, ఆ పాత్రను ప్రకాశ్ రాజ్ పోషిస్తే బాగుంటుందని చెప్పారు.

గతంలో బీజేపీ తరఫున కర్ణాటకలో ప్రచారం చేశానని గుర్తు చేసిన ఆయన, ఆంధ్రాలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, అధిష్ఠానం అడిగితే వెళ్లి ప్రచారం చేస్తానని చెప్పారు. ఈ సంక్రాంతికి సొంత ఊరిలో ఉండాలని అనుకున్నానని, అయితే, పార్టీ పనిపై ఢిల్లీ వెళ్లడంతో కుదర్లేదని కృష్ణంరాజు అన్నారు. తాను పుట్టినరోజు ఫంక్షన్స్ అంటూ ప్రత్యేకించి ఎటువంటి సెలబ్రేషన్స్ చేసుకోబోనని, అయితే, నటుడిగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ఓ ఫంక్షన్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని, సుదీర్ఘకాలంగా తమతో ప్రయాణిస్తున్న ఫ్యాన్స్ ను సన్మానించాలని భావిస్తున్నానని, వివరాలు త్వరలోనే తెలియజేస్తానని అన్నారు.
KrishnamrajuPrabhasBirthdayMarriage

More Telugu News

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40
..more