మీ ఓటు ఆమ్ ఆద్మీ పార్టీకే.. మీరు మాకిచ్చే బహుమానం అదే: శుభలేఖపైకి ఎక్కిన అభిమానం!

19-01-2019 Sat 08:05 | National
  • ‘ఆప్’‌కు ఓటేయాలంటూ శుభలేఖపై ముద్రించిన వధూవరులు
  • తమకిచ్చే గొప్ప బహుమతి అదేనన్న జంట
  • వైరల్ అవుతున్న శుభలేఖ
వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్న ఓ జంట ‘ఆమ్ ఆద్మీ పార్టీ’ (ఆప్)పై తమకున్న అభిమానాన్ని వెరైటీగా చాటుకుంది. తమ పెళ్లి శుభలేఖలపై ఏకంగా ఆ పార్టీకే ఓటేయాలని ముద్రించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆప్’కు ఓటేయడమే మీరు మాకిచ్చే అతిపెద్ద బహుమానమని పేర్కొన్నారు.

హరియాణాకు చెందిన జస్విందర్ సింగ్-ఇంద్రజిత్ కౌర్‌లు త్వరలో వివాహం చేసుకోబోతున్నారు. వీరు తమ పెళ్లి శుభలేఖలపై ‘రానున్న లోక్‌సభ, విధానసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఓటేయండి. మీరు మా పెళ్లికి ఇచ్చే కానుక అదే’ అని ముద్రించారు. ఈ కార్డును ఆఫ్ సోషల్ మీడియా వ్యూహకర్త అంకిత్ లాల్ ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో వైరల్ అయింది.

కాగా, ఆప్ అధికార ప్రతినిధి కుల్దీప్ కడ్యాన్ కూడా ఇటువంటిదే మరో ఆహ్వాన పత్రికను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఆ శుభలేఖలో సీఎం కేజ్రీవాల్, ఆప్ నేతలు గోపాల్ రాయ్, నవీన్ జైహింద్ చిత్రాలను ముద్రించారు. ఈ శుభలేఖను పోస్టు చేసిన ఆయన హరియాణాలోని చాలాచోట్ల ఇటువంటి పరిస్థితే ఉందని పేర్కొన్నారు.
AAPArvind Kejriwalwedding cardHaryanaNew Delhi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more