ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను చెప్పేది ఇదే..!: కడపలో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్
- కడపలో బీజేపీ శక్తి కేంద్రాల ఇన్చార్జ్ల సమావేశం
- హాజరైన కేంద్రం హోం మంత్రి
- చంద్రబాబు తమకు సహకరించడం లేదన్న మంత్రి
ఏపీలో పదేళ్లలో సాధించాల్సిన ప్రగతిని కేవలం నాలుగున్నరేళ్ల కాలంలోనే 80 శాతం సాధించినట్టు రాజ్నాథ్ తెలిపారు. మరో రెండేళ్లలో వందశాతం ప్రగతి సాధిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవంలో దేశ గౌరవం.. దేశ గౌరవంలో ఆంధ్రప్రదేశ్ గౌరవం ఇమిడి ఉన్నాయన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తాము సుముఖంగా ఉండబట్టే ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్టు రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు.