ఇంజనీరింగ్ పనుల నేపథ్యంలో.. గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దు

17-01-2019 Thu 09:34 | Both States
  • మరికొన్ని రైళ్లు పాక్షికంగా...
  • ఈనెల 21 నుంచి 31వ తేదీ వరకు అమలు
  • గూడూరు జంక్షన్‌లో ఇంజనీరింగ్‌ పనులే కారణం
దక్షిణ మధ్య రైల్వే గుంటూరు రైల్వే డివిజన్‌ పరిధిలో ఈనెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు సీనియర్‌ మండల వాణిజ్య అధికారి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఓ రైలు ఈనెల 20 నుంచి 30 వరకు, మరో రైలు  ఈ నెల 21 నుంచి ఫిబ్రవరి 1 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గూడూరు జంక్షన్‌లో పలు ఇంజనీరింగ్‌ పనులు చేపడుతుండడంతో రద్దు అనివార్యమైందని వివరించారు.

 ఈ కారణంగా గుంటూరులో 12.10 గంటలకు బయలుదేరి డోన్‌కు వెళ్లే రైలు(57328)  ఈనెల 31 వరకు, డోన్‌లో 6.30కి బయలుదేరి గుంటూరు వచ్చే రైలుని(57327)  వచ్చే నెల 1 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. గుంటూరులో 5.15కి బయలుదేరి కాచిగూడ వెళ్లే రైలు (77281)ని గుంటూరు-డోన్‌ మధ్య ఈనెల 31 వరకు, కాచిగూడలో 5.10కి బయలుదేరి గుంటూరు వచ్చే రైలు (77282)ని డోన్‌-గుంటూరు మధ్య ఈనెల 31 వరకు రద్దు చేసినట్లు తెలిపారు.

అలాగే రేపల్లెలో 4 గంటలకు బయలుదేరి మార్కాపురం వెళ్లే రైలు(77247) గుంటూరు-మార్కాపురం మధ్య, మార్కాపురంలో 10.05కి బయలుదేరి తెనాలి వెళ్లే రైలు(77249)ని మార్కాపురం-గుంటూరు మధ్య ఈనెల 21 నుంచి 31 వరకు రద్దు చేసినట్లు వివరించారు. ఇక గుంటూరులో ఒంటి గంటకు బయలుదేరి తిరుపతికి వెళ్లే రైలు(67232)ని బిట్రగుంట-తిరుపతి మధ్య ఈ నెల 31 వరకు పాక్షికంగా రద్దు చేసినట్లు చెప్పారు. తిరుపతిలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి గుంటూరు వచ్చే రైలు (67231)ని తిరుపతి-బిట్రగుంట మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు వివరించారు.
south central railwayguntur divisiontrains canceled

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more