'భోగి' రోజున 'దేవ్' ఆడియో రిలీజ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భోగి' రోజున 'దేవ్' ఆడియో రిలీజ్

  • కార్తీ .. రకుల్ జంటగా 'దేవ్' 
  • ఈ నెల 14న ఆడియో రిలీజ్ 
  • వచ్చేనెల 14న సినిమా విడుదల     
కార్తీ .. రకుల్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' సినిమా రూపొందుతోంది. తమిళంలో లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి హారిస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చాడు. 'భోగి' పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 14వ తేదీన ఈ సినిమా తెలుగు ఆడియోను రిలీజ్ చేయనున్నారు. ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు.

ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ కాన్సెప్ట్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని కార్తీ భావిస్తున్నాడు. గతంలో కార్తీ .. రకుల్ జంటగా నటించిన 'ఖాకీ' తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో ఆకట్టుకుంది. మంచి వసూళ్లు రాబడుతూ ఇక్కడ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 'దేవ్' కూడా అదే బాటలో దూసుకుపోతాడా? లేదా? అనేది చూడాలి.
karthi
rakul

More Telugu News