అంతే స్పీడుతో ఈ బిల్లును కూడా ఆమోదించండి.. అప్పుడే దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుంది: కవిత

  • మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా వేగంగా ఆమోదించాలి
  • దీనికి బలమైన రాజకీయ సంకల్పం కావాలి
  • ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేసిన కవిత
అగ్రకులాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లు... వాయు వేగంతో ఉభయసభల్లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా ఆమోదించాలని టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల బిల్లును ఆమోదించినంత వేగంగా... మహిళా రిజర్వేషన్ల బిల్లును కూడా ఆమోదించాలని ఆమె ట్విట్టర్ ద్వారా కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదముద్ర పడితేనే... దేశం నిజమైన ప్రగతిని సాధిస్తుందని తెలిపారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పాస్ కావాలంటే... బలమైన రాజకీయ సంకల్పం కావాలని చెప్పారు. 

women
reservation
bill
kavitha
TRS

More Telugu News