రైలులో రేణిగుంటకు చేరుకున్న జగన్.. కారులో తిరుపతికి ప్రయాణం!
- నిన్న పాదయాత్రను ముగించిన జగన్
- ఉదయం 10 గంటలకు రేణిగుంటకు
- ఒంటిగంట నుంచి తిరుమలకు నడక ప్రయాణం
అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న తరువాత, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో అలిపిరి చేరుకుని, అక్కడి నుంచి కాలినడకన తిరుమలకు బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రి 7 గంటల సమయంలో ఆయన సామాన్య భక్తులు వెళ్లే మార్గంలో ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటారని, రాత్రికి తిరుమలలో బస చేస్తారని వైకాపా నేతలు వెల్లడించారు.