ఇచ్ఛాపురం రావాల్సింది.. జనాలు తొక్కేసేవారు!: మంత్రి సోమిరెడ్డికి రోజా కౌంటర్
- ఇచ్చాపురం సభకు జన స్పందన లేదన్న సోమిరెడ్డి
- తనదైన శైలిలో స్పందించిన రోజా
- నేడు తిరుమలకు వచ్చిన రోజా
ఈ ఉదయం తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఆమె, ఆపై మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, చంద్రబాబు పాలనను ఎండగడుతూ మరో ప్రస్థానంలా ప్రజా సంకల్ప యాత్ర సాగిందని చెప్పారు. జగన్ నేటి మధ్యాహ్నానికి తిరుమలకు చేరుకుంటారని, ఆపై రాత్రికి ఇక్కడే బస చేస్తారని చెప్పారు. జగన్ కు స్వాగతం పలికేందుకు వచ్చానని చెప్పారు.