చేతకానప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు చేర్చారు?: బీజేపీపై విరుచుకుపడిన ఉద్ధవ్ థాకరే
- కరవు ప్రాంతాల్లో పర్యటించిన ఉద్ధవ్ థాకరే
- ప్రభుత్వం తొలుత రైతుల సమస్యలపై దృష్టి పెట్టాలి
- తాను జన్‌కీ బాత్ మాత్రమే వింటానన్న శివసేన చీఫ్
తనకి ‘మన్‌కీ బాత్’ అవసరం లేదని, తాను ‘జన్‌కీ బాత్’నే వింటానని పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా తమతో కూటమి సాధ్యం కాదని స్పష్టం చేశారు. రైతు సమస్యలు, రామ మందిర నిర్మాణం వంటి వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం విపలమైందన్నారు. కోర్టు తీర్పుల కోసం ఎదురుచూస్తున్నప్పుడు మేనిఫెస్టోలో రామ మందిర నిర్మాణం వంటి హామీలను ఎందుకు ఇచ్చారని బీజేపీని సూటిగా ప్రశ్నించారు.