పాదయాత్రలో తుది అంకం... వెల్లువెత్తిన జనసంద్రం!
- ప్రారంభమైన తుది రోజు యాత్ర
- భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలు
- మధ్యాహ్నం 2 గంటల్లోపు పూర్తి కానున్న యాత్ర
జగన్ పాదయాత్ర చివరి అడుగుల్లో తమ అడుగులను కలిపేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. దారిపొడవునా ఆయనకు ఘన స్వాతం పలుకుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల్లోపు ఆయన తన పాదయాత్రను ముగించుకోనున్నారు. ఆపై ఆయన బహిరంగ సభలో పాల్గొని, అటునుంచి విశాఖపట్నం మీదుగా తిరుపతికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేయనున్నారు. రేపు ఉదయం ఆయన తిరుమలకు కాలినడకన వెళ్లి, వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు.