శబరిమల ఆలయంలోకి శ్రీలంక మహిళ ప్రవేశం నిజమే.. పట్టేసిన సీసీటీవీ!
- ఇంకా రగులుతూనే ఉన్న కేరళ
- 18 మెట్ల నుంచి పోలీసులు వెనక్కి పంపారన్న శశికళ
- ఆమె మాటల్లో వాస్తవం లేదని తేల్చిన ‘మూడో కన్ను’
గురువారం రాత్రి శ్రీలంక మహిళ శశికళ 18 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకున్నట్టు వార్తలు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్పటికే ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశంతో వేడెక్కిన కేరళ.. శశికళ ఆలయ ప్రవేశ వార్తలతో మరింత ఉద్రిక్తంగా మారింది. జనవరి 2న కేరళకు చెందిన బిందు, కనకదుర్గలు అయ్యప్పను దర్శించుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా అదుపుతప్పాయి. వారి ప్రవేశానికి నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా బంద్ కూడా నిర్వహించారు. ఇక తనను 18 మెట్ల వద్ద నుంచి వెనక్కి పంపారని శశికళ చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని సీసీ టీవీ ఫుటేజీ నిరూపించింది.