ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు

04-01-2019 Fri 13:42 | Entertainment
  • కవిత రూపంలో నాగబాబు కామెంట్
  • సోషల్ మీడియాలో వైరల్
  •  మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్   
ఇటీవల బాలకృష్ణ ఎవరో తనకి తెలియదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబు, ఆయన అభిమానుల ఆగ్రహానికి కారకులయ్యారు. తాజాగా ఆయన బాలకృష్ణ చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి కవిత్వం రూపంలో నాగబాబు చేసిన కామెంట్, సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది."కట్టు కథలు కొన్ని .. కల్పనలు ఇంకొన్ని .. చుట్టనేల .. మూట కట్టనేల .. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా .. విశ్వదాభిరామ .. వినరా మామా" అంటూ పోస్ట్ పెట్టిన నాగబాబు, 'కవిత్వాలు మాకు వచ్చండోయ్' అనేది బ్రాకెట్లో పెట్టారు. ఈ పోస్ట్ లో 'స్టే ట్యూన్డ్' అని వ్యాఖ్యానించడం ద్వారా, ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి సెటైర్లు వరుసగా ఉంటాయనే హింట్ ఇచ్చారు. నాగబాబు రాసిన ఈ కవితకు మెగా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి. 
nagababu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more