మీడియా ప్రతినిధులపై దాడి.. వెంటనే బీజేపీకి షాకిచ్చిన జర్నలిస్టులు

04-01-2019 Fri 10:43 | National
  • రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది జర్నలిస్టులపై దాడులు
  • సంఘ్ పరివారే చేయిస్తోందన్న కేయూడబ్ల్యూజే
  • ఇక సహించేది లేదని హెచ్చరిక
గత రెండు రోజులుగా కేరళ అట్టుడికిపోతోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళల ప్రవేశంతో వేడెక్కిన వాతావరణం ఇంకా చల్లారలేదు. మహిళల గర్భగుడి ప్రవేశానికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం నుంచే కేరళలో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గురువారం నాటి బంద్‌తో అది హింసాత్మకమైంది.

బంద్ పేరుతో ఆందోళనకారులు దుకాణాలపై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. రోడ్లపై హంగామా చేశారు. అక్కడితో ఆగక జర్నలిస్టులపై దాడికి దిగారు. పాత్రికేయులపై బుధవారం సాయంత్రం నుంచే జరుగుతున్న దాడులు గురువారం కూడా కొనసాగాయి. బంద్‌ను కవర్ చేసేందుకు వచ్చిన పాత్రికేయులు, ఫొటో, వీడియో జర్నలిస్టులపై అల్లరిమూక దాడులకు పాల్పడింది. మహిళా రిపోర్టర్లను కూడా వదలకుండా యథేచ్ఛగా దాడులకు దిగారు.

బంద్‌లో తమపై జరిగిన దాడికి జర్నలిస్టులు తీవ్రంగా స్పందించారు. తిరువనంతపురం, కోజికోడ్‌లలో బీజేపీ నేతలు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిళ్లై తిరువనంతపురంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కె.సుందరన్ కోజికోడ్‌లో నిర్వహించిన మీడియా సమావేశాలను మీడియా బాయ్‌కాట్ చేసింది. దీంతో వారి ప్రెస్‌మీట్ బోసిపోయింది.

గత రెండు రోజులుగా వందలాదిమంది జర్నలిస్టులపై సంఘ్ పరివార్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (కేయూడబ్ల్యూజే) ఆవేదన వ్యక్తం చేసింది. తమ వార్తలను కవర్ చేయాలని కోరుతూనే జర్నలిస్టులను బీజేపీ నేతలు చావగొడుతున్నారని ఆరోపించింది. ఇకపై సహించేది లేదని తేల్చి చెప్పింది. అందుకనే బీజేపీ మీడియా సమావేశాలను బహిష్కరించినట్టు వివరించింది.
SabarimalaBJPjournalistsKerala

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more