రామ్ చరణ్ తీసుకునే డైట్ ఇదే.. ఫిట్ నెస్, ఆరోగ్యం కోసం మీరు కూడా పాటించండి: ఉపాసన

03-01-2019 Thu 10:03 | Entertainment
  • రామ్ చరణ్ తీసుకుంటున్న డైట్ వివరాలను వెల్లడించిన ఉపాసన
  • ఏమి తీసుకోవాలి.. ఏం తీసుకోకూడదో చెప్పిన మిసెస్ చరణ్
  • అందరూ పాటించాలంటూ సూచన
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా ఉంటాడనే విషయం అందరికీ తెలిసిందే. క్రమం తప్పకుండా వర్క్ అవుట్స్ చేయడంతో పాటు, డైట్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. చరణ్ తీసుకునే డైట్ వివరాలను ఆయన భార్య ఉపాసన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అంతే కాదు, ఈ డైట్ ను అందరూ ఫాలో కావాలని... ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు. రాకేష్ ఉదియారా ఈ డైట్ ను సూచించినట్టు ఆమె పేర్కొన్నారు.

డైట్ వివరాలు ఇవే:
దూరంగా ఉంచాల్సినవి: కాఫీ, డైరీ ప్రాడక్ట్స్, రెడ్ మీట్, గోధుమలు, తీపి పళ్లు, ఆల్కహాల్.
తీసుకోవాల్సిన ప్రొటీన్ ఫుడ్: బేక్డ్, బాయిల్డ్ చికెన్, లెంటిల్స్, తోఫు, చేప.
కార్బొహైడ్రేట్ ఫుడ్ ఛాయిస్: క్వినోవా, బ్రౌన్ రైస్, ఓట్ మీల్, స్వీట్ పొటాటోస్.
వెజిటబుల్ ఛాయిస్: స్టీమ్ చేసిన లేదా దోరగా వేయించిన బీన్స్, ఆస్పరాగస్, బ్రాకోలీ. అన్నింటిలోకి వెల్లుల్లిని చేర్చుకోవడం మంచిది.

21 రోజుల నుంచి 45 రోజుల వరకు ఈ ప్రోగ్రాంను ఫాలో కావాలి. ప్రతి రోజు 12 గంటల పాటు ఉపవాసం (ఆహారం, ఇతర ద్రవ పానీయాలు తీసుకోవద్దు) ఉండాలి. మిగిలిన 12 గంటల సమయంలో మెనూలో సూచించిన ఆహారాన్ని తీసుకోవాలి. మిగిలిన 12 గంటల సమయంలో నీటిని మాత్రమే తీసుకోవాలి. ఇతర పానీయాలు తీసుకోరాదు. ఈ 12 గంటల సమయంలో మన శరీరంలోని విష పదార్థాలు వెలుపలికి వెళతాయి కాబట్టి... వీలైనంత ఎక్కువ నీటిని తాగవచ్చు. ఆల్కనైజ్డ్ వాటర్ అయితే మరీ మంచింది. ఈ సమయంలో పలుమార్లు బాత్ రూమ్ కు వెళ్లడం ఇబ్బందిగా అనిపించవచ్చు. కానీ, మన శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్తున్నాయనే విషయాన్ని గ్రహించండి. దీని వల్ల భయపడవద్దు, ఇబ్బందికి గురి కావద్దు.
ram charanupasanatollywooddiet

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more