డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో రవాణా శాఖ సమూల మార్పులు.. ఇకపై నాలుగు రకాలే!

02-01-2019 Wed 12:01 | Both States
  • టూ వీలర్‌ విత్‌, వితౌట్‌ గేర్‌ విభాగాలు
  • లైట్‌ మోటారు వెహికల్స్‌, రవాణా వాహనాలు మిగిలిన రెండు
  • ఆధార్‌ చూపిస్తే సరిపోతుంది
లైసెన్స్‌ జారీ విషయంలో సమూల మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రకరకాల విభాగాలు, ప్రత్యేక విభాగాలు.. అంటూ లేకుండా ఇకపై మొత్తం వాహనాలను నాలుగు రకాలుగా విభజించి నాలుగు రకాల లైసెన్స్‌లు జారీ చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి రవాణా శాఖ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.  ఇకపై టూ వీలర్‌ విత్‌ గేర్‌, వితౌట్‌ గేర్‌, లైట్‌ మోటార్‌ వెహికల్‌, రవాణా వాహనాలుగా విభజించి లైసెన్స్‌లు జారీ చేస్తారు.

విత్‌గేర్‌, వితౌట్‌ గేర్‌ విభాగంలోకి అన్ని రకాల ద్విచక్ర వాహనాలు వస్తాయి. వాహనం గరిష్ట బరువు 7500 కిలోలు దాటని వాహనాలను లైట్‌ వెహికల్స్‌ కింద చేర్చారు. ఇందులో అన్ని ఆటోలు (త్రిచక్ర, గూడ్స్‌),  నాలుగు చక్రాల ( కార్లు తదితరాలు సొంతం, అద్దెవి, రవాణావి, పాసింజర్‌, కమర్షియల్‌) వాహనాలు వస్తాయి.

ఈ వాహనాలకు లైసెన్స్‌ పొందేందుకు ఎటువంటి ధ్రువపత్రాలు ఇవ్వక్కర్లేదు. లైసెన్స్‌ పొందగోరు వ్యక్తికి ఆధార్‌ ఉంటే సరిపోతుంది. ఇప్పటి వరకు పుట్టిన తేదీ ధ్రువపత్రం, ఎల్‌ఐసీ బాండ్‌ పేపర్‌, కనీస విద్యార్హత వంటి నిబంధనలు ఉండేవి. దీంతో వాటిని సంపాదించడం కోసం నానాపాట్లు పడాల్సి వచ్చేది.ఇకపై పద్దెనిమిదేళ్లు నిండిన వారు ఆధార్‌ చూపించి, డ్రైవింగ్‌ నైపుణ్యం ప్రదర్శిస్తే లైసెన్స్‌ మంజూరు చేస్తారు. మూడేళ్ల అనుభవం ఉంటే బ్యాడ్జి కేటాయింపు వంటి జంజాటం లేనట్టే.

నాలుగో విభాగమైన రవాణా వాహనాలకు మాత్రం ఎనిమిదో తరగతి విద్యార్హత తప్పనిసరి. 7500 కిలోల కంటే ఎక్కువ గరిష్ట బరువు ఉన్న వాహన చోదకులు ఎనిమిదో తరగతి ధ్రువపత్రం, ఆధార్‌ చూపి లైసెన్స్‌ పొందవచ్చు. తాజా మార్పుల వల్ల లైసెన్స్‌ మంజూరు సులభతరమవుతుందని, దీనివల్ల అర్హులందరూ లైసెన్స్‌ పొందుతారని అధికారులు తెలిపారు. అందువల్ల పోలీసుల తనిఖీల్లో పలు నిబంధనల సాకుతో వసూలు చేస్తున్న జరిమానా భారం కూడా వాహన చోదకులపై తగ్గనుంది.
transport departmentlicesnses

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more