చూస్తారుగా... ఇది కాళీ ఆడించే ఆట: 'పేట' తెలుగు ట్రైలర్ అదుర్స్!

02-01-2019 Wed 11:23 | Entertainment
  • 10వ తేదీన విడుదల కానున్న 'పేట'
  • ఈ ఉదయం విడుదలైన ట్రైలర్
  • డైలాగులతో అలరించిన రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్, తాజా చిత్రం 'పేట' తెలుగు ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించగా, నవాజుద్దీన్ సిద్ధిఖి, విజయ్ సేతుపతి, శశికుమార్, త్రిష, సిమ్రన్ లు ముఖ్య పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

ఇక "20 మందిని పంపించాను. అందరినీ చితక్కొట్టి పంపించాడు" అన్న డైలాగుతో ట్రైలర్ మొదలవుతుంది. ఆపై 'కాళీ' పరిచయం, 'వీడు మామూలోడు కాదు మహీ' అన్న డైలాగులతో పాటు రజనీ తనదైన స్టయిల్ లో "హహాహా... చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట" అన్న డైలాగ్, ఫైట్ సీన్, సిమ్రన్, త్రిషల పరిచయం ఉన్నాయి. "చూడటానికి చిన్న పిల్లాడిలా చాలా స్టయిల్ గా ఉన్నారు" అని ఓ అమ్మాయి అనగా, "స్టయిల్ గా ఉన్నానంట... నాచురల్లీ" అని రజనీ అనడం కనిపిస్తుంది.

ఆపై హీరోయిన్లతో రొమాంటిక్ సీన్లలో రజనీ, తన అభిమానులను అలరించే గెటప్పులతో కనిపించారు. "అందమైన, అద్భుతమైన సంఘటనలు ఇకపై ఎన్నో చూస్తావు" అనే డైలాగ్, "వీడు చావాలి జిత్తూ" అన్న నవాజుద్దీన్ డైలాగ్, "ఏయ్... నిజం చెబుతున్నాను... కొట్టి అండర్ వేర్ తో పరిగెత్తిస్తాను. పరువు పోతే మళ్లీ తిరిగి రాదు చూస్కో" అని రౌడీలతో రజనీ అనే డైలాగ్ అలరిస్తుంది.

"ఎవరికైనా పెళ్లాం పిల్లలు అన్న సెంటిమెంట్, గింటిమెంట్ ఉంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోండి. మండిపోతోంది ఇక్కడ. దొరికారా భస్మమే" అన్న ఇంకో డైలాగ్ కూడా ఉంది. చివరిగా మనమేం చేయబోతున్నామన్న ప్రశ్నకు 'స్వీట్ తినబోతున్నాం' అన్న రజనీ సమాధానంతో ట్రైలర్ ముగుస్తుంది. ఈ నెల 10న ఈ సినిమా విడుదల కానుంది.  
PetaRajanikantTrailertelugu

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more