మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్య ‘వందేమాతరం’ వివాదం!

02-01-2019 Wed 11:22 | National
  • ప్రతినెలా మొదటి పనిదినం గీతం ఆలపించాలని గత బీజేపీ ప్రభుత్వం తీర్మానం
  • దాన్ని అమలు చేయని కాంగ్రెస్‌ కొత్త సర్కారు
  • దీంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం
మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలయింది. తాము అధికారంలో ఉండగా ప్రవేశ పెట్టిన ‘వందేమాతరం’ గీతం ఆలపించక పోవడాన్ని బీజేపీ తప్పుపట్టడంతో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్‌లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం సచివాలయంలో ప్రతి నెల మొదటి పనిదినం రోజున ‘వందేమాతరం’ గీతం ఆలపించడాన్ని తప్పనిసరి చేస్తూ  ఆదేశాలు జారీచేసింది.

ఇటీవల రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం జనవరి ఒకటిన దీన్ని పాటించ లేదు. దీనిపై మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ తీరుపై మండిపడ్డారు. ‘వందేమాతరం కేవలం జాతీయ గీతమే కాదు. అది దేశభక్తికి ప్రతీక. అది ప్రజల హృదయాల్లో నూతన ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ దేశం, దేశభక్తి కంటే ఏదీ ఎక్కువ కాదు. తక్షణం వందేమాతర గీతం ఆలపించే ఆనవాయితీని పునరుద్ధరించాలి’ అంటూ ట్వీట్‌ చేశారు.

తన విజ్ఞాపనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే ఈనెల 6వ తేదీన దేశ భక్తులతో కలిసి సచివాలయం ప్రాంగణంలో తాను దేశభక్తి గీతాన్ని ఆలపిస్తానని తెలిపారు. శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమలనాథ్‌ కూడా తీవ్రంగానే స్పందించారు. వందేమాతర గీతం ఆలపించని వారికి దేశభక్తి ఉండదా? అని ప్రశ్నించారు.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూపేంద్రగుప్తా కూడా ఘాటుగానే సమాధానమిచ్చారు. వందేమాతర గీతంపై బీజేపీ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం బాధ్యతలు చేపట్టారని, ఆ పనుల్లో బిజీగా ఉండడం వల్ల ఆలపించకపోయి ఉండవచ్చునని ప్రభుత్వ చర్యపై వివరణ ఇచ్చారు.
Madhya PradeshCongressBJPvandemaatharam

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more