తెలంగాణ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

01-01-2019 Tue 17:25 | Telangana
  • ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరుగుతాయి
  • మొదటి విడత ప్రక్రియ జనవరి 7-21 వరకు
  • రెండో విడత జనవరి 11- 25 వరకు
  • మూడో విడత జనవరి 16-30 వరకు
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఈ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు మూడు విడతలుగా జరగనున్నట్టు చెప్పారు. మొదటి విడత పోలింగ్ జనవరి 21న, రెండో విడత పోలింగ్ జనవరి 25న, మూడో విడత పోలింగ్ జనవరి 30న జరుగుతుందన్నారు.

ఇక మొదటి విడత ఎన్నికల ప్రక్రియ జనవరి 7న ప్రారంభమై 21న, రెండో విడత జనవరి 11న ప్రారంభమై 25న, మూడో విడత జనవరి 16న ప్రారంభమై 30వ తేదీన ముగుస్తాయని వివరించారు. బ్యాలెట్ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని, ఈసారి గ్రామపంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో ‘నోటా’ గుర్తును చేర్చినట్టు వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం నిమిత్తం మైకులు వినియోగించాలని నాగిరెడ్డి ఆదేశించారు.

రాష్ట్రంలో మొత్తం 1,13,190 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుందని, పోలింగ్ రోజునే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా ఉంటుందని నాగిరెడ్డి పేర్కొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు పోటీ చేసే అభ్యర్థులు ఎంత నగదు డిపాజిట్ చేయాలో నాగిరెడ్డి వివరించారు. సర్పంచ్ పదవికి పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు రూ.2000, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు రూ.1000, వార్డు సభ్యులుగా పోటీ చేసే జనరల్ అభ్యర్థులకు- రూ.500,  ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఐదు వేల జనాభా దాటిన పంచాయతీలకు చెందిన అభ్యర్థులు రూ.2,50,000 మించి, ఐదు వేల కంటే తక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీల అభ్యర్థులు రూ.1,50,000 కు మించి ఖర్చు చేయరాదని నిర్ణయించామని, ఈరోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్టు నాగిరెడ్డి తెలిపారు.

కాగా, మొత్తం 12,732 గ్రామ పంచాయతీల్లోని 1,13,170 వార్డు సభ్యుల పదవులకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో 4,480 గ్రామ పంచాయతీలకు, రెండో విడత, మూడో విడతల్లో వరుసగా 4,137, 4,115 గ్రామ పంచాయతీలకు పోలింగ్ జరగనుంది.
Telanganagrama panchayat electionsceonagireddy

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more