గోల్కొండ సెవెన్‌ టూంబ్‌ డెక్కన్‌ పార్క్‌ సమీపంలో యువకుడి దారుణ హత్య

  • స్థానికంగా కలకలం రేపిన ఘటన
  • ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్న తండ్రి
  • పోలీసుల నిర్లక్ష్యం వల్లే తన కొడుకు చనిపోయాడని ఆరోపణ
హైదరాబాద్‌ మహానగరంలోని గోల్కొండ సెవెన్‌ టూంబ్‌ డెక్కన్‌ పార్క్‌ సమీపంలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. 24 ఏళ్ల సొహైల్‌ అనే యువకుడిని హత్యచేసి పడేయడం స్థానికంగా తీవ్ర కలకలానికి కారణమైంది. గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

మృతుని తండ్రి ఫజిల్‌ మాట్లాడుతూ శుక్రవారం సాయంత్రం ఫరీద్‌ అనే వ్యక్తి తమ ఇంటికి వచ్చి తన కొడుకు సొహైల్‌ను బైక్‌పై తీసుకువెళ్లాడని, ఆ తర్వాత ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. తన కొడుకును తీసుకువెళ్లిన వెంటనే కీడును శంకించిన తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు హత్యకు గురయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Hyderabad
golconda
youth murder

More Telugu News