హైకోర్టు తరలింపు మొదలు... తెలంగాణ న్యాయవాదుల భావోద్వేగం!
- ఏపీ హైకోర్టు సామాన్లు తరలించేందుకు వచ్చిన బస్సులు
- నిన్నటివరకూ కలిసున్న న్యాయవాదులు, న్యాయమూర్తులు
- అభినందనలు చెబుతూనే కన్నీరు
రాజకీయ కారణాలు, సెంటిమెంట్, ప్రత్యేక కోర్టులు... ఇటువంటివన్నీ ఎలాగున్నా నిన్నటి వరకూ కలిసిమెలిసి వున్న తెలంగాణ, ఆంధ్రా లాయర్లు, సిబ్బంది నేడు ఒకరిని ఒకరు విడిచి వెళ్లిపోతున్న వేళ, పలువురు కన్నీరు పెట్టుకున్నారు. ఆంధ్రాలాయర్లు, సిబ్బంది, తెలంగాణ న్యాయమూర్తులు, ఉద్యోగులకు శుభాకాంక్షలు చెబుతూనే, ఇలా విడిపోవడం తమకెంతో బాధ కలిగిస్తోందని అంటున్నారు. కాగా, ఈ బస్సులు, లారీలు నేటి రాత్రికి విజయవాడకు చేరుకోనుండగా, సీఎం క్యాంప్ ఆఫీస్ సహా, పలు భవనాలను తాత్కాలిక హైకోర్టు భవనాలుగా ఏపీ సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే.