చిన్నారి వీరేశ్ కిడ్నాప్ సుఖాంతం.. బాబును ఏపీ పోలీసులకు అప్పగించిన పోలీసులు!
- కోర్టు సమక్షంలో అప్పగించిన మహారాష్ట్ర పోలీసులు
- చిన్నారి, నిందితుడితో బయలుదేరిన అధికారులు
- సాయంత్రం తిరుపతిలో మీడియా సమావేశం
స్థానిక కోర్టు సమక్షంలో వీరిని చిత్తూరు పోలీసులకు అప్పగించారు. దీంతో అధికారులు నిందితుడితో పాటు చిన్నారిని తీసుకుని ఏపీకి బయలుదేరారు. కాగా, ఈరోజు సాయంత్రం తిరుపతిలో ఈ విషయమై మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారని పోలీస్ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ దంపతులు తిరుమలలో నిద్రిస్తుండగా 16 నెలల వీరేశ్ ను విశ్వంభర ఎత్తుకెళ్లాడు.