నేను ఇక్కడే నటన నేర్చుకున్నాను: వెంకటేశ్

31-12-2018 Mon 09:49 | Entertainment
  • విశాఖ వచ్చినందుకు ఆనందంగా వుంది 
  • నా సినిమాల షూటింగ్ ఇక్కడ జరిగింది 
  • నా కామెడీ టైమింగ్ నచ్చుతుంది
వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాను రూపొందించాడు. తమన్నా .. మెహ్రీన్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి విశాఖలో ఈ సినిమా ఆడియో వేడుకను నిర్వహించారు.

ఈ వేదికపై వెంకటేశ్ మాట్లాడుతూ .. "వైజాగ్ లో ఈ వేడుక జరుగుతున్నందుకు .. ఇక్కడివారిని మరోసారి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా వుంది. నిజం చెప్పాలంటే నేను ఇక్కడే నటన నేర్చుకున్నాను. ఈ సాగరతీరంలోనే 'స్వర్ణకమలం'.. 'మల్లీశ్వరి' సినిమాల షూటింగ్స్ జరిగాయి. 'ఎఫ్ 2' సినిమా చాలా సరదాగా సందడిగా సాగిపోతుంది. 'నువ్వు నాకు నచ్చావ్' .. 'మల్లీశ్వరి' లలో నా కామెడీ టైమింగ్ కి మంచి పేరు వచ్చింది. మళ్లీ అదే కామెడీ టైమింగ్ ఈ సినిమా చూస్తుంటే గుర్తొస్తుంది. ఈ సినిమాతోపాటు సంక్రాంతికి వస్తోన్న బాలకృష్ణ .. చరణ్ .. రజనీ సినిమాలు కూడా బాగా ఆడాలి" అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 
venkateshvarunthamannahmehreen

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more