న్యూ ఇయర్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. వాహనదారులు నేడు ఇలా వెళ్లాల్సిందే..!

31-12-2018 Mon 08:06 | Telangana
  • బేగంపేట మినహా అన్ని బ్రిడ్జిలపై రాకపోకలు నిషేధం
  • పలు ప్రాంతాల్లో వాహనాల మళ్లింపు
  • రాత్రి రెండు గంటల వరకు ట్రావెల్ బస్సులకు నో ఎంట్రీ
హైదరాబాద్‌లో నేటి రాత్రి పది గంటల నుంచి రాత్రి రెండు గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నట్టు అదనపు సీపీ (ట్రాఫిక్) అనిల్ కుమార్ తెలిపారు. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకే ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు.

 ఒక్క బేగంపేట బ్రిడ్జి మినహా మిగతా అన్ని వంతెనలపైన నేటి రాత్రి రాకపోకలను నిషేధించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు వాహనదారులకు కొన్ని సూచనలు చేశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లేవారు నేడు ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపుగా వెళ్లేవారు తెలుగు తల్లి క్రాస్‌రోడ్డు నుంచి ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

లిబర్టీ నుంచి అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు వెళ్లేవారు జీహెచ్ఎంసీ కార్యాలయం, బీఆర్‌కే భవన్, ఇక్బాల్ మినార్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.  ఖైరతాబాద్ మార్కెట్ నుంచి   నెక్లెస్ రోటరీ వైపు వెళ్లేవారు సెన్సేషన్ థియేటర్, రాజ్‌దూత్ లేన్, లక్డీకాపూల్ మీదుగా గమ్యస్థానాలను చేరుకోవాల్సి ఉంటుంది. ఇక, మింట్ కాంపౌండ్ నుంచి సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌వైపు వెళ్లే రహదారిపై రాకపోకలు నిషేధించారు. ట్రావెల్ బస్సులు, లారీలు, భారీ వాహనాలను నేటి రాత్రి రెండు గంటల వరకు నిషేధించారు. డ్రంకెన్ డ్రైవ్‌ల కోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నారు.
HyderabadNew yearTraffic rulesBegumpet bridgeTelangana

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more