విశాఖ బీచ్ లో ‘ఎఫ్ 2’ మూవీ ఆడియో సీడీ ఆవిష్కరణ

30-12-2018 Sun 21:02 | Entertainment
  • ‘విశాఖ ఉత్సవ్’లో ఆడియో వేడుక
  • ఆడియో సీడీని ఆవిష్కరించిన మంత్రి గంటా
  • ఈ వేడుకలో పాల్గొన్న హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకను విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న విశాఖ ఉత్సవ్ లో ఈరోజు నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ చిత్రం ఆడియో సీడీని ఆవిష్కరించారు.

అనంతరం, గంటా మాట్లాడుతూ, కొన్నేళ్లుగా ప్రతి ఏడాది డిసెంబర్ చివరి వారంలో విశాఖ ఉత్సవ్ ని రాష్ట్ర పండగగా క్రమం తప్పకుండా నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ ఉత్సవం విశాఖకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. భారత్ లోనే అందమైన నగరం విశాఖపట్టణమని, ఏ ప్రముఖుడు ఇక్కడికి వచ్చినా దీని గొప్పతనం గురించి ప్రస్తావించకుండా వెళ్లట్లేదని అన్నారు.

అటువంటి విశాఖకు సినీ ఇండస్ట్రీ తరలి రావాల్సిన అవసరం ఉందని కోరారు. వైజాగ్ లో ఉన్న తమ స్టూడియోలో చిత్ర నిర్మాణాలు ఎక్కువ సంఖ్యలో జరిగేలా చూస్తామని వెంకటేష్ తనకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. వైజాగ్ అనేది సినిమాలకు సెంటిమెంట్ అని, ఇక్కడ షూటింగ్ లేదా ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఏదో ఒకటి నిర్వహించాలని కోరారు.

ఇదే బీచ్ లో కత్రినా కైఫ్ తో కలసి నడిచా: హీరో వెంకటేష్

ఎఫ్ 2 చిత్రంలో రెచ్చిపోయేలా తనతో నటింపజేశాడని ఈ చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిని హీరో వెంకటేష్ ప్రశంసించారు. తన మొదటి సినిమా 'కలియుగ పాండవులు' నుంచి చాలా సినిమాల షూటింగ్ విశాఖలో జరిగిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. ఇదే బీచ్ లో కత్రినా కైఫ్ తో కలసి నడిచానంటూ ‘మళ్లీశ్వరి’ చిత్రం గురించి వెంకటేష్ ప్రస్తావించారు.
F2 movievenkateshvarun tejvizagganta

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more