రూ.10 లక్షలు ఇవ్వకుంటే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తాం: ఎరువుల వ్యాపారికి మావోయిస్టుల పేరిట బెదిరింపులు!

30-12-2018 Sun 14:40 | Andhra
  • భయాందోళనలకు లోనయిన బాధితుడు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన చలం బాబు
  • చిత్తూరు జిల్లా పీలేరులో ఘటన
విశాఖపట్నం మన్యంలో ఇద్దరు టీడీపీ నేతలను మావోయిస్టులు హత్య చేసిన ఘటన మరువకముందే మరోసారి ఏపీలో నక్సలైట్ల కలకలం చెలరేగింది. రెండ్రోజుల్లోగా రూ.10 లక్షలు ఇవ్వకుంటే కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని ఓ వ్యాపారిని గుర్తుతెలియని దుండగులు బెదిరించారు. తాము తలకోన దళం సభ్యులమని చెప్పుకొచ్చారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

జిల్లాలోని పీలేరులో చలంబాబు, తన సోదరుడు రవితో కలిసి ఎరువులతో పాటు సిమెంట్, స్టీల్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రెండు రోజుల్లోగా రూ.10 లక్షలు తమకు ఇవ్వకుంటే కుటుంబాన్ని చంపేస్తామని హెచ్చరించారు. తాము తలకోన దళానికి చెందినవాళ్లమని సదరు వ్యక్తులు చెప్పారు. ఈ మేరకు 9133610713 ఫోన్ నంబర్ నుంచి అన్నదమ్ములకు ఫోన్ కాల్స్, సందేశాలు వచ్చాయి.

దీంతో భయాందోళనలకు లోనయిన వీరిద్దరూ పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై చలంబాబు, రవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, వీరి కుటుంబానికి రక్షణ కల్పిస్తామని పోలీస్ అధికారులు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ సందేశాన్ని మాజీ నక్సలైట్లు పంపారా? లేక ఆకతాయిలు చేసిన పనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Andhra PradeshChittoor District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more