అమరావతిలో 8వ శ్వేతపత్రం విడుదల.. కేసీఆర్ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు!

30-12-2018 Sun 13:12 | Andhra
  • గ్రామీణ, పట్టణ అభివృద్ధిపై వైట్ పేపర్
  • 2022 నాటికి ప్రతీకుటుంబానికి 70 లీటర్ల నీరు
  • మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామాల్లో పంచాయితీ, అంగన్ వాడీ, పాఠశాలల్లో 100 శాతం పక్కా భవనాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మరో రెండేళ్లలో ఈ లక్ష్యాన్ని అందుకుంటామని పేర్కొన్నారు. ప్రతీ గ్రామంలో శ్మశానాలు ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన ప్రజావేదికలో ‘గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై’ 8వ శ్వేతపత్రాన్ని చంద్రబాబు విడుదల చేశారు.

ఏపీలో 2020 నాటికి అందరికీ సురక్షితమైన మంచినీరు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 2022 నాటికి ప్రతీ కుటుంబానికి సగటున రోజుకు 70 లీటర్ల మంచినీటిని అందించగలమని వెల్లడించారు. ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్న 325 గ్రామాల్లో నీటి వసతిని కల్పించామని పేర్కొన్నారు.

ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద రూ.15,874 కోట్లతో ప్రతీ కుటుంబానికి రోజుకు 70 లీటర్ల మేర నీటిని అందిస్తామని సీఎం చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణలో కేవలం 46 శాతం మంది ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏకంగా రూ.56,000 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. అయినా నీళ్లు ఎక్కడ వస్తాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

అలాంటి వారు పాలన ఎలా చేయాలో తనకు చెబుతున్నారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను పరోక్షంగా విమర్శించారు. నిన్న జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబుపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
Andhra PradeshTelanganaChandrababuKCRwhite paper8th

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more