వీడిన మిస్టరీ.. చిన్నారి వీరేశ్ ను కిడ్నాపర్ల నుంచి కాపాడిన మహారాష్ట్ర పోలీసులు!
- కిడ్నాపర్లను గుర్తుపట్టిన స్థానికులు
- పోలీసులకు సమాచారం చేరవేత
- ఏపీకి తీసుకువచ్చేందుకు పోలీసుల ప్రయత్నాలు
మహారాష్ట్రలోని నాందేడ్ లో చిన్నారిని తీసుకెళుతున్న కిడ్నాపర్ ను వార్తల ద్వారా గుర్తుపట్టిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ కిడ్నాపర్ ను ఏపీకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జాదవ్ తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిద్రిస్తున్న సందర్భంగా చిన్నారిని దుండగుడు కిడ్నాప్ చేశాడు.