ఢిల్లీ వసతిగృహంలో దారుణం.. బాలికలపై నిర్వాహకుల అమానవీయ చర్యలు!

29-12-2018 Sat 16:11 | National
  • 6-15 ఏళ్ల బాలికలతో వెట్టిచాకిరి
  • మంచి భోజనం కూడా పెట్టని నిర్వాహకులు
  • పోలీసులకు మహిళా కమిషన్ ఫిర్యాదు
దేశరాజధానిలోని ఓ బాలికల వసతిగృహం నిర్వాహకులు అమానవీయంగా ప్రవర్తించారు. చిన్నారులతో వెట్టిచారికి చేయిస్తూ వారిని తీవ్రంగా హింసించారు. ఎదురు తిరిగితే తీవ్రంగా కొట్టడంతో పాటు భోజనం పెట్టకుండా వేధించేవారు. దీంతో వారంతా మౌనంగా ఉండిపోయారు. ఢిల్లీ మహిళా కమిషన్ చేపట్టిన సాధారణ తనిఖీల్లో ఈ దారుణం వెలుగుచూసింది. కమిషన్ ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసులు ఆ వసతి గృహానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఢిల్లీలోని ఓ వసతి గృహంలో 6 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న 22 మంది అమ్మాయిలు ఉంటున్నారు. అయితే ఈ హాస్టల్ నిర్వాహకులు మాత్రం చిన్నారులతో చాలా దారుణంగా ప్రవర్తించేవారు. చిన్నారులు హాస్టల్ లో ఉండగా చిన్న తప్పు చేసినా జననాంగాలపై కారం చల్లి రాక్షసానందం పొందేవారని ఢిల్లీ మహిళా కమిషన్ విచారణలో తేలింది. అక్కడితో ఆగకుండా వసతి గృహంలో బట్టలు ఉతకడం, వంటపాత్రలను కడగడం, గదులను శుభ్రం చేయడం, టాయిలెట్లను కడిగించడం వంటి పనులను తమచేత చేయించేవారని బాలికలు అధికారులకు చెప్పారు.

ఈ సందర్భంగా తమ మాట వినని చిన్నారులను తీవ్రంగా దండించేవారనీ, జననాంగాలలో కారం చల్లేవారని వెల్లడించారు. పండుగ సమయాల్లో ఇళ్లకు వెళ్లనివ్వకుండా అడ్డుకునేవారనీ, కనీసం మంచి భోజనం కూడా పెట్టడం లేదని వాపోయారు. కాగా, అమ్మాయిల సమస్యలను అధికారులు కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ నిర్వాహకుల నిర్వాకంపై విచారణ  ప్రారంభించారు.
New DelhiCrime Newsharrasmentgirlsshrelter homehostelPolice

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more