నేను బజారువాడినని లక్ష్మీ పార్వతి తిట్టింది.. ఆమెకు బొమ్మ చూపిస్తా!: కేతిరెడ్డి వార్నింగ్

28-12-2018 Fri 13:50 | Entertainment
  • ఎన్టీఆర్ గొప్పతనాన్ని కుమారులు తీస్తున్నారు
  • నువ్వేమో డైలాగులు చెప్పుకుంటున్నావ్
  • లక్ష్మీ పార్వతిపై మండిపడ్డ కేతిరెడ్డి
తెలుగువారి అభిమాన నటుడు ఎన్టీఆర్ జీవితంపై క్రిష్ దర్శకత్వంలో ‘కథా నాయకుడు’, 'మహానాయకుడు' చిత్రాలు; రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తానూ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో సినిమా తీస్తానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గతంలో ప్రకటించారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.

ఎన్టీఆర్ కుమారులు తమ తండ్రి గొప్పతనాన్ని సినిమాగా తీసుకుంటున్నారని కేతిరెడ్డి తెలిపారు. లక్ష్మీ పార్వతికి అసలు ప్రజాదరణే లేదనీ, అసలు ఆమెకు ఎలివేషన్ అవసరం లేదని వ్యాఖ్యానించారు. ‘లక్ష్మీ పార్వతికి నిజంగా ప్రజాదరణ ఉండి, జనాలు ఆమెను చూసేందుకు కోకొల్లలుగా వస్తే ఏదోలే అనుకోవచ్చు. కానీ ఆమె మాత్రం ‘అప్పట్లో ఎన్టీఆర్ భార్యగా నేను 250 మంది ఎమ్మెల్యేలను గెలిపించాను. ఆయనకు వెన్నంటి ఉన్నాను’ అనే డైలాగులతోనే ఇప్పటికీ కాలం గడుపుతోంది. నా సామాజిక వర్గానికి చెందిన పార్టీలో ఉండి నన్ను బజారు వాడినని తిట్టింది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కానీ తాను గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాననీ, అందుకే లక్ష్మీ పార్వతి మొదటి భర్త వీరగంథం సుబ్బారావు ఊరికి వెళ్లి అన్ని నిజాలను తెలుసుకున్నానని కేతిరెడ్డి తెలిపారు. ఆమె తన స్థాయికి మించి మాట్లాడుతోందని మండిపడ్డారు. నిజంగానే లక్ష్మీ పార్వతికి తాను షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వబోతున్నాననీ, ఆమెకు బొమ్మ చూపిస్తానని కేతిరెడ్డి హెచ్చరించారు.
ntrlakshmi parvathimovielakshmies veeragrandhamangrycommentswarning

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more