'కాంచన 3' తెలుగు హక్కుల కోసం పోటీపడుతోన్న నిర్మాతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'కాంచన 3' తెలుగు హక్కుల కోసం పోటీపడుతోన్న నిర్మాతలు

  • లారెన్స్ నుంచి 'కాంచన 3'
  • హారర్ పాళ్లు పెంచిన లారెన్స్ 
  • ఈ సారి మలయాళంలోను విడుదల
హారర్ థ్రిల్లర్ సినిమాలను తెరకెక్కించడంలో లారెన్స్ సిద్ధహస్తుడు. ఆయన దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను సాధించాయి. దాంతో 'కాంచన' సిరీస్ లో మరో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

'కాంచన 3' సినిమాను ఏప్రిల్ 18వ తేదీన విడుదల చేయనున్నట్టు ఇటీవలే లారెన్స్ ప్రకటించాడు. దాంతో అందరిలోను కుతూహలం ఎక్కువవుతోంది. 'కాంచన 3'ని తమిళ .. తెలుగు భాషలతో పాటు మలయాళంలోను లారెన్స్ విడుదల చేయనున్నాడు. ఇంతకు ముందు వచ్చిన హారర్ థ్రిల్లర్ సినిమాల కంటే ఈ సినిమా మరింతగా భయపెడుతుందని మరీ చెప్పాడు. 'కాంచన' సిరీస్ లోని సినిమాలకి భారీ వసూళ్లు వచ్చిన కారణంగా, 'కాంచన 3' తెలుగు హక్కులను సొంతం చేసుకోవడానికి చాలామంది నిర్మాతలు పోటీపడుతున్నారట. చివరికి తెలుగు హక్కులు ఎవరి చేతికి దక్కుతాయో చూడాలి మరి. 
lawrence
oviya
vedika

More Telugu News