సోదరుడిపై పన్నీర్ సెల్వం ఆగ్రహం.. పార్టీ నుంచి బహిష్కరణ!
- పన్నీర్ సెల్వం సోదరుడు రాజా
- సెల్వం వద్దన్నా సహకార సంఘం ఎన్నికల్లో పోటీ
- పార్టీ నుంచి బహిష్కరణ..ప్రాథమిక సభ్యత్వం రద్దు
ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజాతో ఎటువంటి సంబంధాలు నెరపవద్దని పార్టీ కార్యకర్తలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా, థేని జిల్లాలోని పెరియకులం పంచాయతీ సర్పంచ్ గా రాజా పని చేశారు. పన్నీర్ సెల్వంకు ఇష్టం లేకపోయినప్పటికీ ఆవిన్ పాల సహకార సంఘం ఎన్నికల్లో రాజా పోటీ చేసి గెలిచారు.