ఘనంగా శ్వేతాబసు ప్రసాద్ వివాహం.. ఫొటోలను అభిమానులతో పంచుకున్న నటి!

  • పూణేలో ముగిసిన వివాహ వేడుకలు
  • బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి
  • ఫిల్మ్ మేకర్ రోహిత్ ను పెళ్లాడిన నటి
ప్రముఖ హీరోయిన్, నటి శ్వేతాబసు ప్రసాద్ వివాహం ఘనంగా జరిగింది. పూణేలో నిన్నరాత్రి సన్నిహితుల సమక్షంలో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ను శ్వేత పెళ్లి చేసుకుంది. బంధువులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు కుటుంబాలకు చెందిన సభ్యులు డ్యాన్సులతో అలరించారు. బెంగాలీ సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ పెళ్లి వేడుకలో పింక్‌ కలర్‌ సిల్క్‌ చీరలో శ్వేతా బసు మెరిసిపోయారు.

కాగా, ఈ వివాహ వేడుకలకు సంబంధించిన ఫొటోలను శ్వేతా బసు ప్రసాద్  ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. ఆమె భర్త రోహిత్ కూడా ‘ఇక అయిపోయింది’ అని తన పెళ్లి ఫొటోను పేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మక్డీ చిత్రం ద్వారా బాలనటిగా సినీరంగంలోకి వచ్చిన శ్వేత.. ఆ సినిమాకు జాతీయ అవార్డును సైతం అందుకున్నారు. తెలుగులో కొత్త బంగారు లోకం, కళవర్ కింగ్ సహా పలు చిత్రాల్లో శ్వేత నటించింది. ప్రస్తుతం ముంబైకే పరిమితమైన శ్వేతా బసు.. పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
Go Back to Shorts
Bollywood
sweta basu prasad
marriage
Instagram
pune
rohit

More Telugu News