15 రోజులు .. 700 కోట్లు .. '2.ఓ' సంచలనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

15 రోజులు .. 700 కోట్లు .. '2.ఓ' సంచలనం

  • తొలివారంలో 526.86 కోట్లు 
  • రెండవ వారంలో 710.98 కోట్లు 
  • తమిళనాడు వసూళ్లు 166.98 కోట్లు 
బలమైన కథాకథనాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి శంకర్ అందించిన చిత్రమే ' 2.ఓ'. ప్రపంచవ్యాప్తంగా తెలుగు .. తమిళ .. హిందీ వెర్షన్స్ లో ఈ సినిమా విడుదలైంది. తొలిరోజు నుంచే ఈ సినిమా విజయవిహారం చేయడం మొదలుపెట్టింది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకున్న ఈ సినిమా, అదే జోరును కొనసాగిస్తూ మూడు వెర్షన్స్ లోను 100 కోట్ల గ్రాస్ ను సాధించిన రికార్డును సొంతం చేసుకుంది.

నిన్నటితో 15 రోజులను పూర్తిచేసుకున్న ఈ సినిమా 700 కోట్ల మార్కును చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా తొలివారంలో 526.86 కోట్లను వసూలు చేసిన ఈ సినిమా, రెండవ వారం పూర్తయ్యేనాటికి 710.98 కోట్లను రాబట్టిందని తమిళ సినిమా ట్రేడ్ అనలిస్ట్ మనోబాల తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఒక్క తమిళనాడులోనే రెండు వారాల్లో 166.98 కోట్లను రాబట్టి, రజనీకాంత్ కెరియర్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా '2.ఓ' నిలవడం విశేషంగా చెబుతున్నారు.     
rajani
akshay

More Telugu News