సీనియర్‌కే జై.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్‌నాథ్.. వీడిన సస్పెన్స్
- మధ్యప్రదేశ్ సీఎంగా కమల్‌నాథ్
- 72 ఏళ్ల వయసులో నెరవేరబోతున్న కల
- జ్యోతిరాదిత్యకు నిరాశ
చింద్వారా నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికైన కమల్‌నాథ్ రెండుసార్లు కేంద్రమంత్రిగా, ప్రొటెం స్పీకర్‌గా పనిచేశారు. అయితే, సీఎం కావాలన్న కల మాత్రం ఇప్పటి వరకు నెరవేరలేదు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఇన్నాళ్లకు ఆయన కల నెరవేరబోతోంది. నిజానికి యువనేత జ్యోతిరాదిత్య సింధియాను సీఎం చేయాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పట్టుబట్టినా, యూపీఏ చైర్ పర్సన్ సోనియా, ప్రియాంక వాద్రా మాత్రం కమల్‌నాథ్‌కే ఓటేశారు. దీంతో రాహుల్ తలొగ్గక తప్పలేదు.