టీఆర్ఎస్ గూటికి మరో ఎమ్మెల్యే .. కేటీఆర్ ని కలిసిన వైరా ఎమ్మెల్యే!

  • కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నాయక్  
  • అభినందనలు తెలిపిన కేటీఆర్
  • ఇప్పటికే మద్దతు తెలిపిన కోరుకంటి చందర్
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజు టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ని మర్యాదపూర్వకంగా రాములు నాయక్ కలిశారు. టీఆర్ఎస్ కు తన మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనకు కేటీఆర్   అభినందనలు తెలిపారు. రాములు నాయక్ తో పాటు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కేటీఆర్ ను కలిశారు.

కాగా, వైరా నియోజకవర్గంలో 2013 ఓట్ల మెజార్టీతో రాములు నాయక్ గెలిచారు. ఇదిలా ఉండగా, రామగుండం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గిన కోరుకంటి చందర్ ఇప్పటికే టీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించారు. వీరి చేరికతో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 90కి చేరుతుంది.   
Go Back to Shorts
TRS
KTR
wyra
ramulunaik
independent

More Telugu News