15 ఏళ్ల బీజేపీ పాలనకు చెక్.. 2003 తర్వాత మళ్లీ చత్తీస్గఢ్లో కాంగ్రెస్
- వరుసగా మూడు పర్యాయాలు సీఎంగా రమణ్ సింగ్
- మోదీ రికార్డు బద్దలు
- తాజా ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవం
15 ఏళ్ల క్రితం డిసెంబరు 7న రమణ్ సింగ్ చత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడుసార్లు గద్దెనెక్కి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన బీజేపీ నేతగా రికార్డులకెక్కారు. ఇప్పటి వరకు ఈ రికార్డు ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ పేరుపై ఉంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఏకధాటిగా 4,610 రోజులు పనిచేశారు. రమణ్ సింగ్ ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రిగా 5 వేల రోజులు పూర్తిచేసుకుని మోదీ రికార్డును బద్దలుగొట్టారు.